Generic selectors
Exact matches only
Search in title
Search in content
lyrics
album
artist

yemoko Chiguru Song Lyrics


Album: Annamayya


 

ఏమొకో చిగురుటధరమున ఎడనెడకస్తూరి నిండెను | భామిని విభునకు వ్రాసిన పత్రికకాదుకదా ||

|| కలికి చకోరాక్షికి కడకన్నుల కెంపైతోచిన | చెలువంబిప్పుడిదేమో చింతింపరేచెలులు |
సలుపునప్రాణేశ్వరుపై నాటినయాకొనచూపులు | నిలువునపెరుకగనంటిన నెత్తురుకాదుకదా ||

|| పడతికి చనుగవమెరుగులు పైపై పయ్యెదవెలుపల | కడుమించిన విధమేమో కనుగొనరే చెలులు |
వుడుగనివేడుకతో ప్రియుడొత్తిన నఖశశిరేఖలు | వెడాలగవేసవికాలపు వెన్నెలకాదుకదా ||

|| ముద్దియ చెక్కుల కెలకుల ముత్యపు జల్లుల చేర్పుల | వొద్దికలాగులివేమో ఊహింపరే చెలులు |
గద్దరి తిరువేంకటపతి కౌగిటయధరామౄతముల | అద్దిన సురతపు చెమటల అందము కాదుకదా ||

Your email address will not be published. Required fields are marked *

Enable Notifications    OK No thanks