Padaharu Kalalaku Song Lyrics
ఓం… శ్రీ పద్మావతే భూదేవే సమేతస్య
శ్రీ మద్వేంకట నాయకస్య నిత్యషోడశోపచార
పూజాం చ కరిష్యే ఆవాహయామి
అతడు: పదహారు కళలకు ప్రాణాలైన
నా ప్రణవ ప్రణయ దేవతలకు ఆవాహనం…
బృందం: ఓం ఆసనం సమర్పయామి
అతడు: పరువాల హొయలకు పైయ్యెదలైన
నా ఊహల లలనలకు ఊరువులాసనం
బృందం: ఓం ధ్యానం సమర్పయామి
అతడు: చిత్తడి చిరు చెమటలా చిందులు చిలికే
పద్మినీ కామినులకు పన్నీటి స్నానం
బృందం: ఓం గంధం సమర్పయామి
అతడు: ఘలం ఘలన నడల వలన అలిసిన
నీ గగన జఘన సొబగులకు శీతల గంధం
బృందం: ఓం నైవేద్యం సమర్పయామి
అతడు: రతి వేద వేద్యులైన రమణులకు
అనుభవైక వేద్యమైన నైవేద్యం
బృందం: ఓం తాంబూలం సమర్పయామి
అతడు: మీ తహతహలకు తపనలకు తాకిళ్లకు
ఈ కొసరి కొసరి తాంబూలం
బృందం: ఓం సాష్టాంగ వందనం సమర్పయామి
అతడు: ఘనం ఘరంగ భంగిమలకు
సర్వాంగ చుంబనాల వందనం
|
No comments yet